నిప్పు, నిజాయితీ, నీతి అనే పదాలు చంద్రబాబు ఉపయోగించకుండా ఉంటే మంచిదని కూడా సలహా ఇచ్చారండోయ్. ఎందుకంటే, ఆ పదాలు చంద్రబాబుకు సూట్ కావట.
తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చంద్రబాబునాయుడుపై తొడగొడుతున్నారు. బస్తీమే సవాలంటున్నారు. మంత్రిపదవులు ఇచ్చిన ఫిరాయింపు ఎంఎల్ఏలతో చంద్రబాబు రాజీనామాలు చేయిస్తే తాను కూడా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. మంత్రివర్గంలో నలుగురు వైసీపీ ఎంఎల్ఏలకు చంద్రబాబు స్ధానం కల్పించటంపై రాష్ట్రంలో అన్నీ వర్గాల నుండి వ్యతిరేకత మొదలైంది. ప్రతిపక్షాలు మొదలు స్వంత పార్టీ టిడిపిలో కూడా చంద్రబాబుపై పలువురు బాహాటంగానే మండిపడుతున్నారు.
అదే సమయంలో తలసాని కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తాను టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిపదవి తీసుకున్నప్పుడు తనను, కెసిఆర్, గవర్నర్ ను అమ్మనాబూతులు తిట్టిన చంద్రబాబు ఇపుడు ఏ మొహం పెట్టుకుని ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇంతమంది ప్రశ్నిస్తున్నా నోరు విప్పని చంద్రబాబు తలసాని ప్రశ్నకు సమాధానం చెబుతారా? మొత్తానికి అప్పట్లో మాట్లాడని తలసాని ఇపుడు మాత్రం భలేగా గొంతు సవరించుకుంటున్నారు కదా? తనపై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీలో చెప్పులరిగేలా తిరిగిన చంద్రబాబు ఇపుడు ప్రతిపక్షాలు, టిడిపి నేతల ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని నిలదీసారు. తలసాని అడిగినదాంట్లో తప్పేం లేదుకదా?
నిప్పు, నిజాయితీ, నీతి అనే పదాలు చంద్రబాబు ఉపయోగించకుండా ఉంటే మంచిదని కూడా సలహా ఇచ్చారండోయ్. ఎందుకంటే, ఆ పదాలు చంద్రబాబుకు సూట్ కావట. పార్టీలో క్రమశిక్షణ ఎన్టీఆర్ తోనే పోయిందని కూడా స్పష్టం చేసారు. చంద్రబాబుకు సంబంధించిన వాస్తవాలు చూడాలంటే సోషల్ మీడియాలో వచ్చేవి చూస్తే చాలట. చంద్రబాబును చూసి నేతలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని కూడా చెప్పారు. 2004కన్నా 2019లో మరింత ఘోర ఫలితాలు రాబోతున్నాయని కూడా జోస్యం చెప్పారు తలసాని. మరి మీరేమంటారు?
