తాడిపత్రి: తన కుటుంబం గురించి మాట్లాడితే  బజార్లోనే కొడతానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. 

సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కుటుంబాన్ని ఏదైనా చేయాలని ఆలోచన చేస్తే  తాను కూడా అదే పనిచేస్తానని ఆయన జేసీ కుటుంబాన్ని హెచ్చరించారు.

also read:నేను అడ్డుపడకపోతే నీ కొడుకు చనిపోయేవాడు: పెద్దారెడ్డిపై జేసీ

తనను చంపాలని వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై వ్యంగ్యంగా స్పందించారు.  జేసీ ప్రభాకర్ రెడ్డిని చంపినా కుక్కను చంపినా ఒక్కటేనని ఆయన అన్నారు.

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం 30 ఏళ్ల కిందటే పోయిందన్నారు. తనను  భయపెట్టేందుకు ప్రయత్నిస్తే ఊరుకొంటానా అని ఆయన ప్రశ్నించారు. తాడిపత్రికి మకుటం లేని మహరాజులమని జేసీ బ్రదర్స్ అనుకొంటున్నారని ఆయన చెప్పారు. తాడిపత్రిని సొంత దీవీలా జేసీ బ్రదర్స్ చూశారన్నారు. తాను  చర్చలకే కట్టుబడి ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. 

తాను మాట్లాడేందుకు వెళ్లా.. కొట్లాడుకొందాం అంటే రా అని ఆయన సవాల్ విసిరారు.  తన కుటుంబంతో పాటు నేను వస్తా.. మీ కుటుంబంతో మీరు రండి ఎవరో ఒకరు మిగులుతారని ఆయన చెప్పారు. అప్పుడైనా పోలీసులకు టెన్షన్ తగ్గుతోందన్నారు.పోలీసులపై ఒత్తిడి ఉంటే  తనపై పోలీసులు ఎందుకు కేసులు పెడతారని పెద్దారెడ్డి ప్రశ్నించారు