తాడిపత్రి: తాను అడ్డం పడకపోతే నీ కొడుకు చనిపోయి ఉండేవాడని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆదివారం నాడు ఆయన తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై సీసీ పుటేజీని చూపిస్తానని ఆయన చెప్పారు.

రాళ్ల దాడి జరుగుతున్న సమయంలో తాను వెళ్లి నీ కొడుకును జీపులో అక్కడి నుండి పంపించినట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో తనకు రాయి దెబ్బ తగిలిందన్నారు.తన పొట్ట భాగంలో రాయి దెబ్బను ఆయన మీడియాకు చూపించారు. 

తనతో పాటు తన కొడుకు అస్మిత్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. కానీ తాను మాత్రం నీ కొడుకుపై కేసు పెట్టనని ఆయన చెప్పారు. తనతో మాట్లాడడానికి వస్తూ కత్తి కొడవళ్లు తీసుకొనివస్తారా అని ఆయన ప్రశ్నించారు.

తనకు ఎందుకు గన్ మెన్లు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తనకు గన్ లైసెన్స్ రిజెక్టు చేస్తే కోర్టుకు వెళ్తానని ఆయన చెెప్పారు. మొన్ననే జైలుకు వెళ్లి వచ్చాను. తనకు భయం లేదన్నారు.

పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మీరు మారకపోతే వ్యవస్థ సర్వనాశనం అవుతోందని ఆయన చెప్పారు. ఎస్పీ కూడ తన మీద ఒత్తిడి ఉందని చెప్పారన్నారు.సీసీ పుటేజీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన కోరారు.ఎందుకు ధైర్యంగా పోలీసులు వ్యవహరించడం లేదని ఆయన ప్రశ్నించారు. తన బస్సులను రకరకాల కారణాలతో నిలిపివేశారని ఆయన ఆరోపించారు.

also read:నన్ను చంపాలని చూస్తున్నారు: సజ్జలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

పెద్దారెడ్డి  చంబల్ లోయలో ఉండాల్సిన వడని ఆయన విమర్శలు చేశారు. 1990 సెప్టెంబర్ 20వ తేదీన  చోటు చేసుకొన్న  ఘటనను ఆయన ప్రస్తావించారు. 1993 జూన్ నెలలో పెద్దారెడ్డి వర్గీయులు దౌర్జన్యం చేశారన్నారు. 

తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాయలసీమ డీఐజీ, ఎస్పీ, సీఐ తదితరులకు సీసీటీవీ  పుటేజీతో పాటు లేఖ రాసిన విషయాన్ని ఆయన చెప్పారు.

ఇద్దరు వ్యక్తుల మధ్య ఆడియో సంభాషణపై  సుమోటోగా తీసుకొని కేసు పెట్టిన పోలీసులు... తన ఇంట్లో సీసీటీవీ పుటేజీలో నమోదైన దృశ్యాల ఆధారంగా ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.