కరోనా మహమ్మారి కారణంగా రైతులకు కౌలు సొమ్ము జమకావడం లేటు అయ్యిందన్నారు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తుళ్లూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కుల,జాతి,మత రాజకీయాలు చూడకుండా ప్రతి రైతుకు కౌలు చెల్లించామని స్పష్టం చేశారు.

రైతుల కూలీల ముసుగులో టీడీపి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారని శ్రీదేవీ ఆరోపించారు. ఫోటోల కోసమే ధర్నాలు చేస్తున్నారని.. ఇది ఫోటో ధర్నా అని ఆమె అభివర్నించారు.

కొందరు తమ భూములు అమ్ముకున్న వారికి కౌలు నగదు అకౌంట్లో జమకలేదు,వారి భూములు సర్వే జరుగుతుందని, తదుపరి కౌలు నగదు జమ అవుతుందని శ్రీదేవి వెల్లడించారు.

సీఆర్డీఏ రద్దు అయినా సరే కౌలు నగదు రైతుల అకౌంట్లో జమచేసామని వెల్లడించారు. ప్రతి ఏటా 10% కౌలు పెంచుతూ ,15 ఏళ్ల పాటు కౌలు ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయించారని ఆమె చెప్పారు.

భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ కూడా 5000లకు పెంచామని, దీనిని త్వరలో ఇస్తామన్నారు. రాష్ట్రం విడిపోయాక అమరావతి అంటూ చంద్రబాబు ఇక్కడ భ్రమరావతి చేశారని చెప్పారు.

అమరావతి లక్షకోట్లు ప్రాజెక్ట్ అంటూ  ప్రజల్ని మోసం చేశారని శ్రీదేవి ఆరోపించారు. టీడీపీ 5 ఏళ్ల హయాంలో ఐదువేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన 95 వేల కోట్ల సంగతేంటని ఆమె ప్రశ్నించారు.

విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు చేసిందేమి లేదని, అసైన్డ్ రైతులకు జరీబు భూములతో సమాన ప్యాకేజీ ఇచ్చే బిల్లును మండలిలో అడ్డుకున్నారని శ్రీదేవి మండిపడ్డారు. గవర్నర్ ఆమోదించిన బిల్లులను కూడా కోర్టుల ద్వారా తెలుగుదేశం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. 

 

 

"