సానుభూతి టీడీపీ అభ్యర్థికి పనిచేసిందని శిల్పా కామెంట్ 18వేలకు పైగా చేరుకోవడం కష్టమే. 11వ రౌండ్ లో 20వేలకు పైగా అధిక్యంలో కోనసాగుతున్న టీడీపీ అభ్యర్థి.

టీడీపీ అభ్య‌ర్థికి సానుభూతితో ఓట్లు ప‌డ్డాయ‌ని పెర్కొన్నారు అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఫలితాల సరళి పై ఆయ‌న స్పందించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన 18వేల మోజార్టిని చేరుకోవ‌డం క‌ష్ట‌మే అయినా పూర్తి ఫలితాలు వచ్చేంత వరకూ వేచి చూస్తామని అన్నారు. ఓడినంత మాత్రాన నిరుత్సాహపడేది లేదని తెలిపారు. 

ప్ర‌స్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి స్పష్టమైన ఆధిక్యత కనబరచడంపై ప్రస్తుతానికి తానేమీ చెప్పబోనని అన్నారు. తొమ్మిదో రౌండ్ తరువాత ఆయనకు 19,657 వేల ఓట్లకు పైగా మెజారిటీలో కొన‌సాగుతున్నారు.


నంద్యాల అర్బన్ లో టీడీపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉండటంతో అక్కడ ఆధిక్యం కొనసాగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక, గోస్పాడులోనూ టీడీపీ ఆధిక్యం కనబరుస్తుందనే ధీమాను టీడీపీ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. 


ప‌ద‌కొండ‌వ రౌండ్ పూర్త‌యో స‌రికి టీడీపీ అభ్య‌ర్థికి 20 వేల‌కు పైగా మెజార్టీతో ముందున్నాడు

మరిన్ని నూతన వార్తా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి.