సీఎం జ‌గ‌న్ ను  శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సోమ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను సీఎంకు అందించారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (ap cm jagan mohan reddy) ఆయ‌న నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి (swathmanamdemdra swami) సోమ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను సీఎంకు అందించారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్ కు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వేద ఆశీర్వచనం అంద‌జేశారు. కాగా వ‌చ్చే నెల‌లో 7వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు ఆ పీఠంలో వార్షిక మహోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌రాధికారితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (ttd chairman yv subbareddy) కూడా సీఎంను క‌లిశారు.