విశాఖపట్టణం:చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  నదీ హరతులు, పథకాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆరోపించారు.

బుధవారం నాడు  ఆయన ఓ కార్యక్రమంలో  మాట్లాడారు.  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో   ప్రభుత్వ ఖజనాకు గండిపడేలా తీసుకొన్న నిర్ణయాలపై విచారణ జరిపించాలని  సీఎం వైఎస్ జగన్‌ను కోరుతానని ఆయన ప్రకటించారు.

రెండు నెలల 20 రోజుల పాటు చతుర్మాత దీక్షకు వెళ్తున్నట్టుగా స్వరూపానందేంద్ర తెలిపారు. 18 ఏళ్లుగా లోక కళ్యాణార్ధం ఈ రకమైన దీక్షలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.