భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి వేడినీరు ఆమె మీద పోసిన ఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యింది.
పార్వతీపురం : భార్యపై అనుమానంతో ఓ భర్త వేడి నీరు ఆమె ముఖం మీద కొట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురంలో కలకలం రేపింది. సోమవారం ఈ ఘటన వెలుగు చూడగా.. బాధితురాలు పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఇక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దమయంతి, తాడంగి ప్రసాద్ దంపతులు. వీరిద్దరూ టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు.
కాగా, కొంతకాలంగా ప్రసాద్ కు భార్య మీద అనుమానం కలిగింది. దీంతో చిన్నదానికి పెద్ద దానికి ఆమెతో గొడవ పడుతుండేవాడు. సోమవారం నాడు టిఫిన్ కోసం ఓ యువకుడు వారి షాప్ కి వచ్చాడు. ఆమె అతనికి పార్సిల్ కడుతోంది. అప్పుడే వచ్చిన ప్రసాద్ ఆమె మీద అనుమానపడ్డాడు. అంతే వేడివేడి మీరు ఆమె ముఖం మీద కొట్టాడు.
కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందినవారు సీపీటీ పాస్ కావడం తప్పనిసరి.. ఏపీ సర్కార్
అనుకోని ఈ పరిణామానికి ఒకసారిగా షాక్ అయినా భార్య గట్టిగా కేకలు వేసింది. వేడినీరు పడడంతో ముఖం మీద, నుదురుపై గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఆమె కూతురు పవిత్ర మీద కూడా వేడినీరు పడడంతో బొబ్బలెక్కాయి. విషయం తెలిసిన దమయంతి తల్లిదండ్రులు ఆమెను చికిత్స కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అందంగా ఉండటమే ఆమె పాలిట శాపంగా మారింది. భర్తలో అనుమానం భూతం రెక్కలు విప్పుకుంది. చివరికి అది పెనుభూతంగా మారి ఆమెను హత్య చేసే వరకు దారితీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగు చూసింది. తల్లి హత్యకు గురవడం, తండ్రి హంతకుడిగా మారడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. కళ్యాణ్ అలియాస్ చంటికి శిరీష (23) అనే మహిళతో ఐదేళ్ల కిందట పెద్దలు వివాహం చేశారు. వీరికి సంతానం ఇద్దరు మగపిల్లలు. కాగా పెళ్లైన కొద్ది రోజులనుంచి కల్యాణ్ కు భార్య మీద అనుమానం ఏర్పడింది.
అది పెనుభూతంగా మారింది. దీంతో ఆమెను హత్య చేశాడు. దీనిమీద వన్ టౌన్ సీఐ విక్రమసింహ మాట్లాడుతూ... ఆదోనిలోి కిలిచిన పేటకు చెందిన నాగులు, వీరాభాయి కొడుకు కల్యాణ్. అతనికి కొంతకాలంగా భార్యమీద అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరచుగా గొడవకు దిగుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా భార్యభర్తలు తీవ్రంగా గొడవపడ్డారు.
ఆదివారం ఉదయం ఆ గొడవ నేపథ్యంలోనే భార్య శిరీషను చంటి టవల్ తో గొంతుకు ఉరివేసి చంపేశాడు. ఆ తరువాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు తమ చిన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడితే చూడడానికి వెళ్లారు.
