Asianet News TeluguAsianet News Telugu

కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందినవారు సీపీటీ పాస్ కావడం తప్పనిసరి.. ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు(సీపీటీ) పాస్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Andhra Pradesh Govt key orders on compassionate appointments ksm
Author
First Published Jul 25, 2023, 3:33 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు(సీపీటీ) పాస్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు కూడా జారిచేసింది. 2023 ఫిబ్రవరి 24న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కారుణ్య నియామకాలు పొందిన వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. అదే సమయంలో టైపిస్టు, లోయర్ డివిజన్ టైపిస్ట్, అప్పర్ డివిజన్ టైపిస్టు, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు ఇంగ్లీష్, తెలుగు టైప్ రైటింగ్ పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలన్న అర్హతను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

అయితే ఆయా ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలు పొందిన వారంతా సీపీటీ అర్హత కలిగి ఉండాలని.. ఉద్యోగాలు పొందిన రెండేళ్లలోగా  సీపీటీ అర్హత సాధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సీపీటీ అర్హత సాధించిన తర్వాతే సర్వీసును రెగ్యులర్ చేస్తామని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios