ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో రగడ కొనసాగుతూనే ఉంది. తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో రగడ కొనసాగుతూనే ఉంది. తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ప్రస్తతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. అయితే తాజాగా మూడు రాజధానులకు సంబంధించిన కేసుపై ఫిబ్రవరి 7న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక, సీఎం జగన్ మంగళవారం ఢిల్లీ జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ రాజధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా రాజధాని కానున్న విశాఖపట్నంకు మిమ్మల్ని ఆహ్వానించేందుకు వచ్చాను. నేను కూడా వైజాగ్‌కి షిఫ్ట్ అవుతాను’’ అని అన్నారు.