మాగుంట రాఘవకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ: రెండు వారాల నుండి ఐదు రోజులకు బెయిల్ కుదింపు

మాగుంట రాఘవకు  సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.   ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు వారాల బెయిల్ ను  ఐదు రోజులకు కుదించింది

Supreme Court  Reduces Magunta Raghava  Reddy  Bail  14 days  To Five days  lns


 

న్యూఢిల్లీ: మాగుంట  రాఘవకు  సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.  ఢిల్లీ హైకోర్టు  ఇచ్చిన  రెండు వారాల బెయిల్ ను  ఐదు రోజులకు కుదించింది. ఈ నెల  12న తిరిగి  కోర్టు ముందు లొంగిపోవాలని  మాగుంట  రాఘవను సుప్రీంకోర్టు  ఆదేశించింది.

మాగుంట  రాఘవ రెడ్డికి  ఈ నెల  7వ తేదీన ఢిల్లీ హైకోర్టు  బెయిల్ ఇచ్చింది.   తన అమ్మ్మమ్మకు  అనారోగ్యంగా  ఉన్నందున తనకు  ఆరు వారాల పాటు  మధ్యంతర బెయిల్ కోరుతూ  పిటిషన్ దాఖలు  చేశారు. అయితే  రాఘవకు   ఆరు వారాల పాటు కాకుండా  రెండు వారాలపాటు  మధ్యంతర బెయిల్ ను   రెండు  రోజుల క్రితం  ఢిల్లీ హైకోర్టు  మంజూరు చేసింది.  అయితే  ఢిల్లీ హైకోర్టు   మాగుంట  రాఘవకు బెయిల్  మంజూరు చేయడాన్ని  ఈడీ  నిన్న  సుప్రీంకోర్టులో  సవాల్  చేసింది.   ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే  ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని   కోరింది. దీంతో  ఇవాళ  ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది  సుప్రీంకోర్టు.

also read:మాగుంట రాఘవకు బెయిల్: స్టే కోరుతూ సుప్రీంలో ఈడీ పిటిషన్

బెయిల్ పొందేందుకు  మాగుంట రాఘవ కోర్టుకు అబద్దాలు చెప్పారని   ఈడీ తరపున న్యాయవాది   ఇవాళ  సుప్రీంకోర్టులో వాదించారు.  మాగుంట రాఘవరెడ్డి  మోసపూరితంగా   బెయిల్ పొందారని  ఈడీ   తరపు న్యాయవాది   ఆరోపించారు. తొలుత  అమ్మమ్మకు, ఆ తర్వాత  నాన్నమ్మకు  అనారోగ్యంగా ఉన్నారని  చెప్పారన్నారు. అంతేకాదు  తన భార్య ఆత్మహత్యాయత్నం  చేశారని  తప్పుడు  ఆరోపణలు ఆధారాలు ఇవ్వబోయారని ఈడీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు  వాదించారు. నివేదికలు, ధృవపత్రాలు  పరిశీలించాలంటే  పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారని ఈడీ వివాదించింది. ధనవంతులు  ఇలాంటి  వైద్య నివేదికలు  తేవడం  పరిపాటిగా మారిందని ఈడీ  ఆరోపించింది.  సాధరణ  బెయిల్ ఇచ్చేందుకు  ట్రయల్ కోర్టు   నిరాకరించిందని  ఈడీ కోర్టు  పేర్కొంది. కుటుంబ సభ్యుల  అనారోగ్యం  పేరుతో మధ్యంతర బెయిల్ కు ప్రయత్నిస్తున్నారని ఈడీ  పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios