మాగుంట రాఘవకు బెయిల్: స్టే కోరుతూ సుప్రీంలో ఈడీ పిటిషన్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన భెయిల్ పై స్టే ఇవ్వాలని ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్ఢర్ పై స్టే ఇవ్వాలని గురువారంనాడు ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
తన అమ్మమ్మకు అనారోగ్యంగా ఉన్నందున ఆరు వారాల పాటు బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాగుంట రాఘవ. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్నది హైకోర్టు . మాగుంట రాఘవకు బెయిల్ ఇవ్వవద్దని హైకోర్టును ఆశ్రయించింది. తన అమ్మమ్మ అనారోగ్యానికి చెందిన ఆసుపత్రికి చెందిన ఆధారాలను కూడ రాఘవ సంబంధించిన న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అయితే ఆరు వారాలకు బదులుగా రెండు వారాల పాటు బెయిల్ ను ఇస్తూ ఈ నెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే కోరుతూ ఈడీ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై వెంటనే విచారణ జరిపించాలని కోరింది. అయితే రేపు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించనున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలు దఫాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. మాగుంట రాఘవ నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆ తర్వాత రాఘవను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సంస్థలు, పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ, సీబీఐ అధికారులు పలుమార్లు సోదాలు చేశారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురిని ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ,. ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ , ఈడీ అధికారులు కూడ విచారించారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారనున్నారు.ఈ మేరకు శరత్ చంద్రారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.