స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా సుప్రీం కోర్టు తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను కొనసాగించనున్నట్టగా పేర్కొంది. ఇక, తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
Also Read: నేరస్తులకు రక్షణ కవచంగా 17ఏ మారొద్దు: సుప్రీంలో సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ
ఇక, చంద్రబాబు పిటిషన్‌పై సోమవారం నాటి విచారణకు కొనసాగింపుగా ఈరోజు కూడా.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రధానంగా మరోసారి పీసీ యాక్ట్‌లోని 17ఏ చుట్టే వాదనలు కొనసాగాయి. అయితే చంద్రబాబు పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.