Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సుప్రీం ఆదేశం

కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డికి  సుప్రీంకోర్టులో  స్వల్ప ఊరట లభించింది.   ఎల్లుండి తెలంగాణ హైకోర్టు  వెకేషన్ బెంచ్  ను ఆశ్రయించాలని  సుప్రీంకోర్టు  సూచించింది.  

Supreme Court  Orders To  file  Petition  in Telangana  High Court Vacation Bench  lns
Author
First Published May 23, 2023, 12:40 PM IST

న్యూఢిల్లీ: కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  ఈ నెల  25వ తేదీన  వెకేషన్  బెంచ్  వెళ్లాలని  సుప్రీంకోర్టు  మంగళవారం నాడు  సూచించింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  నిన్న  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్   మంగళవారంనాడు విచారించింది.అయితే  ఈ నెల  25వ తేదీన విచారణ జరపాలని  తెలంగాణ హైకోర్టును ఆదేశించింది  సుప్రీంకోర్టు. జస్టిస్ జేకే మహేశ్వరి, జ.స్టిస్ నరసింహంలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం  ఇవాళ  ఈ విషయమై ఆదేశాలు ఇచ్చింది. 

ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించేలా   తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను  ఆదేశించాలని  సుప్రీంకోర్టులో  వైఎస్ అవినాష్ రెడ్డి  ఈ నెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. పూర్తిస్థాయిలో విచారించి  తుది ఉత్తర్వులివ్వాలని  ఆ పిటిషన్ లో  అవినాష్ రెడ్డి  కోరారు.  ఈ పిటిషన్ పై  ఇవాళ  సుప్రీంకోర్టు  విచారించింది.

ఏప్రిల్  24 తర్వాత  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఎన్ని దఫాలు  సీబీఐ విచారణకు  వెళ్లారని  సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.  ఇప్పటివరకు  మూడు దఫాలు  సీబీఐ నోటీసులు  జారీ చేసినా కూడా   వైఎస్ అవినాష్ రెడ్డి  విచారణకు  హాజరు కాలేదని  వైఎస్ సునతా రెడ్డి  తరపు న్యాయవాది  వాదనలు విన్పించారు. నిన్న  కర్నూల్ ల  చోటు  చేసుకున్న పరిణామాలను  కూడా  సునీతా రెడ్డి తరపు న్యాయవాదులు  సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుంచారు.

కడప వైఎస్ అవినాష్ రెడ్డి   ముందస్తు బెయిల్ కోరుతూ  గతంలో  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.  అయితే ఈ పిటిషన్ పై  ఈ ఏడాది ఏప్రిల్  చివరిలో  విచారణ  జరిగింది. అయితే అదే  రోజున  తెలంగాణ హైకోర్టు  చివరి పని దినం,.  అయితే  ఈ విషయమై  తీర్పును  ఇవ్వలేమని  తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.  ఈ ఏడాది  జూన్  5వ తేదీకి  తెలంగాణ హైకోర్టు  ఈ పిటిషన్ పై విచారణను   వాయిదా వేసింది. మరో వైపు  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి సీబీఐ నోటీసులు  జారీ చేసింది.

also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్: సుప్రీంలో ప్రారంభమైన విచారణ

ఈ నెల  16, 18, 22న  సీబీఐ అధికారులు  విచారణకు  రావాలని  వైఎస్ అవినాష్ రెడ్డికి  నోటీసులు  ఇచ్చారు. అయితే  పలు  కారణాలను  చూపుతూ  వైఎస్ అవినాష్ రెడ్డి  విచారణకు హాజరుకాలేదు.  ఈ నెల  22న  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. ఈ నెల  25వ తేదీన  తెలంగాణ వెకేషన్  కోర్టులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్దు బెయిల్ పిటిషన్ పై  విచారణ జరగనుంది.అన్ని పక్షాలు  తెలంగాణ హైకోర్టు  వెకేషన్  బెంచ్ ముందుంచాలని  సుప్రీంకోర్టు ధర్మాసనం  సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios