Asianet News TeluguAsianet News Telugu

ఏబీ వెంకటేశ్వర రావుకు సుప్రీంలో షాక్: హైకోర్టు ఉత్తర్వుల నిలివిపేత

ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు నిలిపివేసింది.

Supreme court orders give shock to AB Venkateswar Rao
Author
New Delhi, First Published Nov 26, 2020, 11:47 AM IST

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏబీ వెంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సస్వెన్షన్ వేటు వేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వం విధించిన స్టేను తొలగిస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది. ఏబీ వెంకటేశ్వర రావుపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు జారీ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసిది. ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను ఎత్తేస్తే దర్యాప్తు మీద ప్రభావం పడుతుందని ప్రభుత్వం వాదించింది. తాజా సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ కొనసాగుతుంది.

Also Read: ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్... సుప్రీం న్యాయమూర్తి కీలక నిర్ణయం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వర రావు నిఘా విభాగం చీఫ్ గా పని చేశారు. ఆ కాలంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం తేల్చింది. 

భద్రతుక సంబంధించిన పలు కీలక విషయాలను వెంకటేశ్వర రావు బహిర్గతం చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. పోలీసు ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావించింది. 

Also Read: ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ లో చుక్కెదురు: పిటిషన్ తోసివేత

ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్, ఇఁడియన్ ప్రోటోకాల్ ఒకే విధమైన ప్రమాణాలను కలిగి ఉంటాయని, దర్యాప్పులో వెంకటేశ్వర రావు తప్పు చేసినట్లు తేలడంతో ఆయనను ప్రభుత్వం స్సపెండ్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios