ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీం షాక్: సీబీఐ విచారణ కొనసాగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణను కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
 

Supreme court orders  CBI inquiry on AP minister Adimulapu Suresh assets case

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని supreme court శుక్రవారం నాడు ఆదేశించింది.

also read:ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ కేసు: తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.2016లో చేపట్టిన సోదాల్లో పలువురు ఐఆర్ఎస్ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ గుర్తించింది. ఇందులో భాగంగానే సురేష్‌తో పాటు ఆయన భార్య ఐఆర్ఎస్ అధికారిణి విజయలక్ష్మిపై సీబీఐ 2017లో కేసు నమోదు చేసింది. 

Supreme court orders  CBI inquiry on AP minister Adimulapu Suresh assets case

2009లో సురేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆయన కూడా ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన విషయం తెలిసిందే. 2016లో సురేష్ నివాసాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి 2017లో కేసు నమోదు చేశారు. సురేష్ భార్య ను ఏ1గా, మంత్రి సురేష్ ను  ఏ 2 గా చేర్చారు.

ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో సురేష్ దంపతులు సవాల్ చేశారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టివేసింది.  అయితే ఈ విషయమై సీబీఐ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. 

ఈ విషయమై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 22న  తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ విచారణను కొనసాగించాలని  ఉన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పును వెల్లడించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios