Asianet News TeluguAsianet News Telugu

Godavari boat accident: బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకు నోటీసులు

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచ్చులూరు మధ్యలో గోదావరి నదిలో బోటు మునిగిన ఘటననై కేంద్రానికి సుప్రీంకోర్టు సోమవారం నాడు నోటీసులుజారీ చేసింది. ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు విచారణను ప్రారంభించింది.మాజీ ఎంపీ హర్షకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను ప్రారంభించింది.

Supreme court issues notice to union government on godavari boat incident
Author
Vijayawada, First Published Nov 4, 2019, 1:57 PM IST

న్యూఢిల్లీ:తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు మధ్యలో బోటు మునిగిన ఘటనపై సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also read:operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

కచ్చులూరు వంటి ప్రమాదాలో చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

Also read:బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

బోటు ప్రమాదానికి సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మంత్రి ఆవంతి శ్రీనివాస్ స్పందించిన విషయం తెలిసిందే. 

సెప్టెంబర్ 15వ తేదీన పాపికొండలకు వెళ్తున్న రాయల్ వశిష్ట పున్నమి బోటు దేవీపట్నం-కచ్చులూరు మధ్యలో బోటు మునిగింది.  38వ రోజున అంటే  ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన గోదావరి నది నుండి బోటును వెలికితీశారు. 

Also read:బోటు మునక: గోదావరిలో కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట

ప్రమాదం జరిగిన రోజున రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణం చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.. 26 మంది ఈ ప్రమాదం నుండి సురక్షితంగా ప్రమాదం నుండి బయటకు వచ్చారు. 

ప్లాన్ బీ లో భాగంగా బోటుకు చెందిన ప్యా‌న్ కు ఇనుప రోప్ ను తగిలించారు. ఈ రోప్ ద్వారా బోటును వెలికితీశారు.ధర్మాడి సత్యం బృందంతో పాటు డీప్ వాటర్ డైవర్లు బోటు వెలికితీతలో కీలక పాత్ర పోషించారు. విశాఖకు చెందిన  ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ చెందిన డ్రైవర్లు నాగరాజు, స్వామి అనే ఇద్దరు గోదావరి నదిలో మునిగిన బోటుకు  లంగర్ వేశారు.

అండర్ వాటర్ డైవర్లు  మూడు చోట్ల  లంగర్లు వేశారు. బోటు ముందు భాగంతో పాటు వెనుక భాగానికి లంగర్లు వేశారు. ప్లాన్ ఏ  ప్రకారంగా ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు ప్రయత్నించింది.కానీ ఈ ప్లాన్ సక్సెస్ కాలేదు.

అయితే ఎట్టకేలకు గత నెల 26వ తేదీన రాయల్ వశిష్ట పున్నమి బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది.బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం బృందాన్ని కలెక్టర్ అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios