రఘురామకృష్ణంరాజు కొడుకు భరత్ పిటిషన్: సీబీఐ, కేంద్రప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
తన తండ్రిని సీఐడీ పోలీసులు కొట్టారని ఈ విషయమై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
న్యూఢిల్లీ: తన తండ్రిని సీఐడీ పోలీసులు కొట్టారని ఈ విషయమై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేసే విధంగా వ్యవహరించారనే నెపంతో ఏపీ సీఐడీ అధికారులు
alsoread:ఆర్మీ ఆస్పత్రి కమాండర్ కు రఘురామ లేఖ: గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు
ఈ నెల 14వ తేదీన అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ నుండి ఆయనను విజయవాడకు తరలించారు. విజయవాడలో అదే రోజు రాత్రి సీఐడీ అధికారులు తనను కొట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విజయవాడ కోర్టుకు కూడ వివరించారు. ఇదే విషయమై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోపుగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.