Asianet News TeluguAsianet News Telugu

కేఆర్ఎంబీపై సుప్రీంలో ఏపీ పిటిషన్: తెలంగాణ,కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

కేఆర్ఎం‌బీ  పరిధిని  కేంద్ర ప్రభుత్వంఖారు చేసిన తర్వాత  చోటు చేసుకున్న పరిణామాలపై  వివరాలను    సమర్పించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది జనవరి 10వతేదీకి వాయిదా వేసింది.

Supreme Court Issues notice to Telangana Government Over KRMB Issue
Author
First Published Nov 15, 2022, 9:48 AM IST

న్యూఢిల్లీ:కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పై సుప్రీంకోర్టు సోమవారంనాడు  కీలక ఆదేశాలు  జారీచేసింది.కేఆర్ఎంబీ పరిధిని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయడంతో   పాటు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ  చేసింది.

కేఆర్ఎంబీతో సహా ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. విచారణ  సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నిఅంశాలను ప్రస్తావించింది.తెలంగాణ ప్రభుత్వం బోర్డులకు ప్రాజెక్టులకు అప్పగించలేదని తెలిపింది.అయితే బోర్డుల విధుల గురించి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేఆర్ఎంబీ విధుల గురించి సుప్రీంకోర్టుకు ఏపీప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరించారు. తాము తమప్రాజెక్టులను కేఆర్ఎంబీకి  అప్పగించినట్టుగా ఏపీ ప్రభుత్వం   తరపు న్యాయవాదలు  తెలిపారు.అయితే తెలంగాణ తరపున వాదించిన న్యాయవాది కూడా తెలంగాణ ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీ తన పరిధిలోకి తీసుకుందని చెప్పారు.

సుప్రీంకోర్టులో ఏపీ  ప్రభుత్వం పిటిషన్  దాఖలు చేసిన  తర్వాత పరిణామాలపై వివరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ విషయమై  కేంద్రప్రభుత్వానికి,తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు  నోటీసులు జారీచేసింది.ఈ కేసు విచారణను వచ్చే  ఏడాది జనవరి 10వ  తేదీకి వాయిదా వేసింది.  

కృష్ణా, గోదావరి నదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి.ఈ వివాదాలకుచెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో  రెండు రాష్ట్రాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ  పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి  తీసుకురావడాన్నితెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకు రావడంపై తెలంగాణ ప్రభుత్వం  ఇంజనీరింగ్ అధికారులతో కమిటీని ఏర్పాటు   చేసింది. ప్రాజెక్టులను  బోర్డుల పరిధిలోకి తీసుకురావడం వల్ల కలిగే లాభ,నష్టాలపై ఈ కమిటీ  అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని  ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.

alsoread:శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసేలా ఆదేశాలివ్వాలి:తెలంగాణపై కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడాన్ని ఏపీ ప్రభుత్వం స్వాగతించింది .తమ ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగిస్తామని ప్రకటించింది. అయితే అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టులకు బోర్డులకు  అప్పగిస్తే తాము కూడా అప్పగించేందుకు సిద్దమని  తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులనిర్మాణంతోపాటు నీటి వాటాల విషయంలో వివాదాలున్నాయి. కృష్ణా,గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు  పరస్పరం  ఫిర్యాదులు చేసుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios