ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై విచారణను సుప్రీంకోర్ట్ వాయిదా వేసింది. ఇది పార్లమెంట్ పరిధిలోని అంశమని , దీనిపై ముందుకు వెళ్లలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బిల్లు ఆమోదం చట్టబద్ధంగా లేదన్న పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై స్పందిస్తూ.. ఇది పార్లమెంట్‌కు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించింది. ఈ కేసు లోపలికి వెళ్లడం లేదని, వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.