Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కు షాక్... జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు

జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. 

Supreme court grants conditional bail to Judge Ramakrishna akp
Author
Amaravati, First Published Jun 15, 2021, 12:04 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన జడ్జి రామకృష్ణకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. విచారణాధికారుకు సహకరించాలని... కేసు అంశంపై మీడియాలో మాట్లాడవద్దని ఆదేశించారు. రూ.50వేల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ఇటీవల తీవ్రవ్యాఖ్యలు చేసిన జడ్జి రామకృష్ణను మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు.  బీ కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళుతుండగా దారి మధ్యలో  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  

గతంలో కూడా న్యాయమూర్తి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  రామకృష్ణ పిన్నమ్మ మరణించిన తర్వాత కూడా ఆమె పింఛన్ ను ఫోర్జరీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మదనపల్లె పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

వీడియో

read more  డాక్టర్ సుధాకర్ పరిస్థితే జడ్జి రామకృష్ణకు...: మాజీ మంత్రి ఆందోళన

ప్రస్తుతం రామకృష్ణ సస్పెన్షన్ లో ఉన్నారు. గతంలో న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులే ఆ దాడి చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఈ దాడిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. దళిత సంఘాలు కూడా ఖండించాయి. అయితే, ఆ దాడితో తనకు ఏ సంబంధమూ లేదని అప్పుడే మత్రి పెద్దిరెడ్డి  స్పష్టం చేశారు 
 
గతంలో న్యాయమూర్తి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను బీ కొత్తకోట పోలీసులు తీసుకుని వెళ్లారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై రామచంద్రను విచారణ నిమిత్తం తీసుకుని వెళ్లారు.  

Follow Us:
Download App:
  • android
  • ios