ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
అమరావతి: అమరావతి భూకుంభకోణం విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తే సుప్రీం కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ కు ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
అమరావతి భూకుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం మాజీ అడ్వకేట్ దమ్మలపాటి సహా 13 మందికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ జనవరి చివరి వరకు వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటివరకు ఈ కేసును ఫైనల్ చేయవద్దని హైకోర్టుకు ఆదేశించింది సుప్రీం కోర్టు.
read more రాజధాని భూముల స్కాం: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు సహా 12 మందిపై ఏసీబీ కేసు
ఏపీ ప్రభుత్వ తరుఫున రాజీవ్ ధావన్ వాదనలు వినిపిస్తూ రాజధాని భూ కుంభకోణం కేససు వివరాలు ఎందుకు వెల్లడికావద్దు? అని అడిగారు. నేరం జరిగిన తరువాత దర్యాప్తు చేయవద్దా? అని ప్రశ్నించారు. దర్యాప్తు, మీడియా రిపోర్టింగ్ ఏదీ జరగకూడదా? దమ్మలపాటి కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి ఎలా వర్తిస్తారు? పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారు అంటూ ఐపీ హైకోర్టు తీర్పుపై ప్రశ్నించారు.
అమరావతి రాజధాని ఏర్పాటు నేపథ్యంలో జరిగిన భూముల కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసు నమోదుకాగా... ఎఫ్ఐఆర్‌లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. దమ్మాలపాటిని ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అభియోగాలు మోపారన్న వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు పిటిషనర్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయానే సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 25, 2020, 2:05 PM IST