వైఎస్ వివేకా హత్య: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 

Supreme Court Dismisses  Devireddy sivasankar reddy petition   in YS Vivekananda Reddy Murder case

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు డిస్మిస్ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో నిందితుడిగా ఉన్న  దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని  దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి లు  సవాల్ చేశారు. ఈ  పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని సహ నిందితులు ఎలా సవాల్ చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో  వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు.  దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దస్తగిరితో పాటు వివేకానందరెడ్డి ఇంటి వద్ద  వాచ్ మెన్ గా పనిచేసిన రంగయ్య కూడా సీబీఐ అధికారులకు కీలక సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. 

also read:వివేకానందరెడ్డి హత్య కేసు: శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

2019  మార్చి19వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. బెంగుళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ డబ్బుల విషయమై మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గంగిరెడ్డి హత్య చేయించారని  దస్తగిరి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ వాంగ్మూలం ఆధారంగా విచారించిన సీబీఐ అధికారులు  సునీల్  యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విచారించాలని సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఈ పిటిషన్  పై  ఈ ఏడాది సెప్టెంబర్ 19న  సుప్రీంకోర్టు విచారించింది. ఏపీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించడంపై వైఎస్ సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విషయాన్నిఆమె ప్రస్తావించారు. 

ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి  దాఖలు చేసిన బెయిల్ పిటిషన్  ను సుప్రీంకోర్టు ఈ ఏడాది  సెప్టెంబర్ 26న తిరస్కరించింది. అంతకుముందే ఏపీ హైకోర్టు కూడ ఈ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన విషయం తెలిసిందే.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios