Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు పాల్ప‌డింద‌న్న జ‌గ‌న్ స‌ర్కారు ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వేనంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వులు స‌వ‌రించాలంటూ ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క విచార‌ణ చేప‌ట్టింది. 

Supreme court Comments on Amravathi Insider trading
Author
Hyderabad, First Published Jul 17, 2021, 10:04 AM IST

అమరావతి లో భూముల కొనుగోళ్ల కేసుల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై తాజాగా సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడ ఇన్ సైడర్ ట్రేటింగ్ జరగలేందంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని సుప్రీం ప్రశ్నించింది. అన్ని కోణాల్లో విచారించిన తర్వాతే.. హైకోర్టు ఈ కేసును కొట్టివేసిందని సుప్రీం పేర్కొంది.

అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు పాల్ప‌డింద‌న్న జ‌గ‌న్ స‌ర్కారు ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వేనంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వులు స‌వ‌రించాలంటూ ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు శుక్ర‌వారం కీల‌క విచార‌ణ చేప‌ట్టింది. 

ఈ విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వ న్యాయ‌వాది దుష్యంత్ ద‌వేకు జ‌స్టిస్ వినీత్ శ‌ర‌ణ్, జ‌స్టిస్ దినేశ్ మ‌హేశ్వ‌రిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని కురిపించింది. అస‌లు అమ‌రావతిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ఎక్క‌డ జ‌రిగింది? అన్న‌ట్లుగా ధ‌ర్మాస‌నం చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒకానొక ద‌శ‌లో ద‌వే ఖంగు తిన్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసు ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు స‌వ్యంగానే ఉందంటూ ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

మరోవైపు అమరావతికి చెందిన మిగిలిన కేసులతో కలిపి విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే సుప్రీంకోర్టును కోరారు. రాజధాని రాకముందే అప్పటి మంత్రులు భూములు కొనుగోలు చేశారని, హరియాణా భూములపై ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కేసుపైనా విచారణ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అయితే దీనిపై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని కొట్టేసిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios