ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంలో స్వల్ప ఊరట: స్కిల్ కేసుపై దీపావళి తర్వాత తీర్పు
చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తుంది. ఈ కేసుల విషయంలో చంద్రబాబు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ కేసుపై చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది.
న్యూఢిల్లీ: ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దీపావళి తర్వాత తీర్పును వెల్లడించనున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
ఎల్లుండి ఈ నెల 19వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులున్నాయి. దీపావళి సెలవుల తర్వాత ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై వెల్లడించనున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నెల 30వ తేదీ లోపుగా ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై తీర్పు తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారించనున్నట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ ఫైబర్ నెట్ కేసుపై చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఇవాళ అనిరుద్దబోస్, త్రివేది ధర్మాసనం విచారించింది.
ఈ నెల 23వ తేదీన ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. అయితే అదే రోజున చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా కొడుకు వివాహం ఉంది. దీంతో ఈ పిటిషన్ పై విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని లూథ్రా సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
also read:ఇసుక పాలసీలో అవకతవకలపై కేసు: ఏపీ హైకోర్టులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్
అప్పటివరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. ఈ విషయమై ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు కూడ సమ్మతిని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని గతంలో ఇచ్చిన హామీ కొనసాగుతుందని సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. ఇరువర్గాల న్యాయవాదుల వాదనల తర్వాత ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి చంద్రబాబు న్యాయవాదులు తీసుకువెళ్లారు.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ ఏడాది అక్టోబర్ 20న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో సెక్షన్ 17 ఏ చుట్టూనే వాదనలు జరిగాయి. చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు.
also read:ఏపీ ఫైబర్ నెట్ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా
చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ కూడ ముడిపడి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం గత విచారణలో అభిప్రాయపడింది. చంద్రబాబుపై ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీవారంట్ పై యథాతథస్థితి కొనసాగించాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించింది.విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.