అమరావతి:అమరావతి భూములపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది ఏప్రిల్ 7కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ప్రతివాదుల అఫిడవిట్‌లోని అంశాలపై తమ అభిప్రాయాన్ని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ తెలిపారు.

విచారణ పేరుతో బలవంతపు చర్యలు ఉండవని కోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదన్నారు. సీబీఐ లాంటి విచారణ సంస్థ దర్యాప్తు చేసేందుకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని అంశాలను తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ల్కాండ్ స్కామ్ చోటు చేసుకొందని వైసీపీ సర్కార్  చెబుతోంది. ఈ మేరకు మంత్రుల కమిటీ ఓ నివేదికను కూడ ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ నిర్వహిస్తోంది. ఈ విచారణపై కొందరు కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజధాని ప్రాంతంలో చంద్రబాబునాయుడు ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.