వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుతు  ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను ఈ  నెల 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. గంగిరెడ్డికి బెయిల్  రద్దు చేయాలని సీబీఐ తరపు న్యాయవాది నటరాజ్  వాదించారు. 

Supreme Court Adjourns accused  Gangi Reddy Bail cancel petition to on December 09

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్  వివేకానందరెడ్డి హత్య కేసులో  నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్  పై  సుప్రీంకోర్టు  ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.  వైఎస్  వివేకానందరెడ్డి  హత్య కేసులో  ఎర్రగంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా  ఉన్నాడని సీబీఐ తరపు న్యాయవాది  వాదించారు.మాజీ  మంత్రి వైఎస్  వివేకానందరెడ్డి  హత్య కేసులో  నిందితుడిగా  ఉన్న  ఎర్ర గంగిరెడ్డికి  బెయిల్  రద్దు చేయాలని  కోరుతూ  సీబీఐ సుప్రీంకోర్టులో  పిటిషన్  దాఖలు చేసింది.ఈ పిటిషన్  పై  సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా  ఉన్న  ఎర్ర గంగిరెడ్డికి బెయిల్  రద్దు చేయడంతో సాక్షులను ప్రభావితం  చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది ఆరోపించారు. తగిన సమయంలో  చార్జీషీట్  దాఖలు చేయకపోవడంతోపాటు  సీబీఐ విచారణకు ముందే ఈ  కేసును సీఐడీ విచారణ నిర్వహించిందని  సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.

దీంతో  ఎర్ర గంగిరెడ్డికి  డిఫాల్ట్  కింద ట్రయల్ కోర్టు  బెయిల్  మంజూరు చేసిందని  సీబీఐ తరపు న్యాయవాది  వాదించారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్  రద్దు పిటిషన్ లో వివేకానందరెడ్డి  కూతురు వైఎస్  సునీతారెడ్డి  కూడా ఇంప్లీడ్  అయ్యారని  సీబీఐ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. అయితే  గతంలో  కొన్ని  బెయిల్  రద్దు తీర్పులను  సీబీఐ తరపు న్యాయవాది  నటరాజ్  కోర్టు ముందుంచారు.ఈ  విషయమై నివేదిక ఇవ్వాలని కూడా  కోర్టు ఆదేశించింది.మరో వైపు ఈ కేసు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా  సుప్రీంకోర్టు తెలిపింది.

2019 మార్చి  19వ తేదీ రాత్రి  తన నివాసంలోనే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని  దుండగులు హత్య చేశారు.ఈ  కేసులో  ఎర్రగంగిరెడ్డి  సహా పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. ఎర్ర గంగిరెడ్డికి  కోర్టు బెయిల్  మంజూరు చేసింది.  ఈ  కేసులో  నిందితుడిగా  ఉన్న దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు.  దస్తగిరి  ఇచ్చిన  వాంగ్మూలం  సీబీఐ అధికారులకు కీలకంగా మారింది. 

ఈ కేసును ఇతర రాష్ట్రాల్లో విచారించాలని కోరుతూ  వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు సునీతారెడ్డి  దాఖలు చేసిన  పిటిషన్ పై  సుప్రీంకోర్టు ఇటీవలనే కీలక ఆదేశాలు జారీ  చేసింది.  ఈ  కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ  ఆదేశాలు జారీ చేసింది.ఈ  విషయమై ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ఏపీ నుండి  తెలంగాణకు  బదిలీ చేసింది. తెలంగాణలోని  సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ  సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios