ఏపీ పునర్విభజన చట్టంపై ఉండవల్లి పిటిషన్: విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

ఏపీ పునర్విభజన చట్టం విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.ఈ  పిటిసన్ ను వచ్చే వారం లిస్టయ్యేలా చూడాలని రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు. 
 

Supreme Court Accepts For Trial On Ap Reorganisation Act 2014

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

Ap Reorganisation Act 2014 పొరపాట్లు చోటు చేసుకొన్నాయన్నారు. విభజన ప్రక్రియా సరిగా లేదన్నారు. ఈ విషయమై న్యాయం చేయాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ ధర్మాసనం ముందు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ పై త్వరలోనే విచారణను చేపడుతామన్నారు. వచ్చే వారంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా పిటిషన్ ను పొందుపర్చేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు.

భవిష్యత్‌లో రాష్ట్రాల విభజన చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ Undavalli Arun Kumar  సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్‌ ను ఈ ఏడాది మార్చి 7వ తేదీన  దాఖలు చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జతగా ఈ సవరణ పిటిషన్‌ను ఉండవల్లి తరఫు న్యాయవాది రమేశ్‌ అల్లంకి దాఖలు చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తదితరులు ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ Supreme లో గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

 రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని తేలితే దాన్ని ప్రకటించాలని కోరారు. భవిష్యత్‌లో ఏదైనా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాటించేందుకు తగిన మార్గదర్శకాలివ్వాలని కోరారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం మద్దతిచ్చేలా తగిన ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios