వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది.  జగన్ దాదాపు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించారు. ఈ  సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు మొక్కు తీర్చుకున్నారు. 

గుంటూరు జిల్లా  మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జగన్ అభిమానులు 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.  జగన్ 3,648 కిలోమీటర్లు నడిచారు కాబట్టి.. అన్ని కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన రోజు పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు చెల్లించుకున్నారు.