Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసు: సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగింపు.. నార్కో అనాలిసిస్ టెస్ట్‌పై తీర్పు రిజర్వ్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్‌కు రిమాండ్‌ను 15 రోజులకు పొడిగించింది జమ్మలమడుగు కోర్ట్. సునీల్ యాదవ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్ అనుమతిపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 
 

sunil yadav remand extended in ys viveka murder case
Author
Jammalamadugu, First Published Sep 1, 2021, 2:23 PM IST

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్‌కు రిమాండ్‌ను 15 రోజులకు పొడిగించింది జమ్మలమడుగు కోర్ట్. సునీల్ యాదవ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్ అనుమతిపై వాదనలు విన్నారు జమ్మలమడుగు మేజిస్ట్రేట్. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. 

అంతకుముందు ఆగస్టు 16న సునీల్ యాదవ్ ను  మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు పులివెందుల కోర్టు నిరాకరించింది. గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో 10 రోజుల క్రితం కస్టడీలోకి తీసుకొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్ తర్వాత కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ కేసులో  పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios