Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసు : నన్ను వేధిస్తున్నారు..సునీల్ కుమార్ యాదవ్ పిటిషన్..

సునీల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. ఆధారాలను ఇప్పుడే బయట పెట్టలేమని తెలిపింది. వివేకా హత్య ముందు, తర్వాత సునీల్ కుమార్ వ్యవహార శైలిమీద అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ రోజు హై కోర్టులో దీనిమీద విచారణ జరగనుంది. 
 

Sunil Kumar Yadav has filed a petition alleging that he is being harassed in the Viveka murder case - bsb
Author
Hyderabad, First Published Jul 30, 2021, 10:18 AM IST

వివేకా హత్య కేసులో తనను వేదిస్తున్నారని సునీల్ కుమార్ యాదవ్  పిటిషన్ వేశారు. సీబీఐ సైతం హై కోర్టులో దీనికి కౌంటర్ గా మరో పిటిషన్ వేసింది. సునీల్ కుమార్ యాదవ్ ను నిబంధనల మేరు విచారిస్తున్నామని వెల్లడించింది. 

సునీల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. ఆధారాలను ఇప్పుడే బయట పెట్టలేమని తెలిపింది. వివేకా హత్య ముందు, తర్వాత సునీల్ కుమార్ వ్యవహార శైలిమీద అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ రోజు హై కోర్టులో దీనిమీద విచారణ జరగనుంది. 

కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు.  అనుమానితుడుగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సునీల్ కుమార్ యాదవ్.. సమీప బంధువు ఒకరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

విచారణలో భాగంగా నాలుగు రోజుల క్రితం వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్యతో జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన వివేకాకు అత్యంత సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను మీడియాకు వెల్లడించారు.

 అయితే విచారణ పేరుతో సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని సునీల్‌కుమార్‌ యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ రోజు నుంచి పులివెందులలో సునీల్‌కుమార్‌ ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు పులివెందుల వదిలి బంధువుల ఊళ్లకు వెళ్లి ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్‌ కోసం సీబీఐ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అందులో భాగంగానే పులివెందుల మండలం  ఎర్రగుడిపల్లెలో ఉన్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ సమీప బంధువు యువరాజును సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అనంతపురంలో ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి సీబీఐ అధికారులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios