Asianet News TeluguAsianet News Telugu

మోడీతో ఆ నలుగురు ఎంపీల భేటీ

టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్  వెంకయ్యనాయుడుకు  ఈ నలుగురు ఎంపీలు గురువారం సాయంత్రం లేఖ ఇచ్చారు.

sujana chowdary and others meeting with modi today
Author
Amaravathi, First Published Jun 21, 2019, 12:39 PM IST

న్యూఢిల్లీ: టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్  వెంకయ్యనాయుడుకు  ఈ నలుగురు ఎంపీలు గురువారం సాయంత్రం లేఖ ఇచ్చారు.

అనంతరం ఈ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు శుక్రవారం నాడు ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు.

గత టర్మ్‌లో టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ సమయంలో మోడీ కేబినెట్‌లో సుజనా చౌదరి మంత్రిగా కొనసాగారు.  మోడీ కేబినెట్ నుండి టీడీపీ వైదొలిగింది. ఈ సమయంలో కేబినెట్ నుండి వైదొలగడాన్ని సుజనా చౌదరి వ్యతిరేకించారు. మంత్రివర్గం నుండి  వైదొలిగినా.... కనీసం ఎన్డీఏలో కొనసాగాలని సుజనా చౌదరి చంద్రబాబుకు సూచించారు. కానీ,టీడీపీ ఎన్డీఏ నుండి కూడ బయటకు వచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది.  3 ఎంపీ స్థానాలను మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. వైసీపీ 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. ఎన్నికల ఫలితాలతో టీడీపీ ఎంపీలు నిరాశకు లోనయ్యారు. సుజనా చౌదరి నేతృత్వంలో  నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios