కోడలిపై మామ లైంగిక వేధింపులు: సహకరించలేదని కత్తితో దాడి

First Published 11, Jun 2018, 11:23 AM IST
Subbaih arrested for sexual harassment on daughter in law
Highlights

కోడలిపై మామ లైంగిక వేధింపులు


కడప: తన కోరిక తీర్చలేదనే నెపంతో కోడలిపై మామ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకొంది. 


కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేటలోని ఆంజనేయస్వామి గుడికి సమీపంలో సుబ్బయ్య అనే వ్యక్తి కొడుకు రామ్మోహన్ కు 14 ఏళ్ళ క్రితం ఓ యువతితో వివాహమైంది. అయితే వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఓ కొడుకు, కూతురు. కొడుకు కోడలితో కలిసి  అతను కూడ నివాసం ఉంటున్నాడు. 

అయితే కోడలిపై సుబ్బయ్య చాలా కాలం నుండి కన్నేశాడు. ఆమెపై గతంలో రెండు దఫాలు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలు పెద్ద మనుషులతో పంచాయితీ ఏర్పాటు చేసింది. దీంతో  ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. 

అయినా కూడ సుబ్బయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. కోడలిపై వేధింపులను ఇంకా ఎక్కువ చేశాడు. రెండు రోజుల క్రితం మరోసారి వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు కోడలు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం పోలీసులు వచ్చారు. అయితే అతను తప్పించుకొన్నాడు.తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో ఆదివారం ఉదయం పూట వంటగదిలో వంట చేస్తున్న కోడలిపై కత్తితో సుబ్బయ్య నరికాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.


స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుబ్బయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ  ఘటనపై విచారణ చేస్తున్నారు.


 

loader