Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నం గురుకుల పాఠశాలలో ఒకేరోజు 14 మంది చిన్నారులకు అస్వస్థత.. తల్లిదండ్రుల్లో టెన్షన్..

కష్ణా జిల్లా మచిలీపట్నంలో (machilipatnam) పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో (minority gurukula school) ఈ ఘటన చోటుచేసుకుంది. 

students fall ill in machilipatnam minority gurukula school
Author
Machilipatnam, First Published Dec 6, 2021, 9:23 AM IST

కష్ణా జిల్లా మచిలీపట్నంలో (machilipatnam) పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో (minority gurukula school) ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు 14 మంది చిన్నారుల్లో తీవ్ర జ్వరం (High fever), జలుబు లక్షణాలు కనిపించడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారుల నుంచి రక్త నమూనాలు సేకరించిన అధికారులు ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రిలో వివిధ వార్డులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

గురుకుల పాఠశాల సమీపంలోని మురికి నీళ్ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి తల్లిదండ్రులు చెప్పారు. అక్కడ పెద్ద ఎత్తున దోమలు, పందులు చేరడంతోనే ఇలా జరిగి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. అయితే ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే దానిపై స్పష్టత రానుంది. 


పశ్చిమ గోదావరిలో విష జ్వరాలు.. ప్రాణాలు కోల్పోయిన నలుగురు.. 
పశ్చిమ గోదావరి జిల్లాలోని (west godavari district) పలు గ్రామాల్లో విష జ్వరాలు (viral fevers) విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు అంతుచిక్కని జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం (koyyalagudem) మండలం బోడిగూడెంలో (bodigudem) అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. ఎలా వస్తుందో… ఎందుకొస్తుందో తెలియని విష జ్వరాలతో గ్రామం మొత్తం మంచాన పడింది. ఎక్కువగా విద్యార్ధులే బాధితులుగా మారుతున్నారు. దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఫీవర్స్‌ బారినపడ్డారు. ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios