టీచర్ కొట్టాడని ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదుచేసిన పల్నాడు విద్యార్థులు (వీడియో)

చిలకలూరిపేట మండలం రాజాపేట గురుకుల పాఠశాల విద్యార్థులు తమను టీచర్లు టార్గెట్ చేసారని... ఏ తప్పూ చేయకున్నా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Students complaints on PET Teacher to Palnadu Collector AKP

పల్నాడు : తమను ఓ టీచర్ కొడుతున్నాడంటూ స్కూల్ విద్యార్థులు ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసారు. వెంటనే సదరు టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కలెక్టర్ ను కోరారు. తోటి టీచర్ పై విద్యార్థులు కలెక్టర్ కు ఫిర్యాదుచేయడాన్ని హెడ్ మాస్టార్ సమర్దిస్తున్నారు. ఆమే దగ్గరుండి విద్యార్థులను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... చిలకలూరిపేట మండలం రాజాపేట గురుకుల పాఠశాలలో బండ్ల అశోక్ పిఈటి గా పనిచేస్తున్నాడు. అయితే తమను టార్గెట్ చేసిమరీ విచక్షణారహితంగా కొడుతున్నాడంటూ అశోక్ పై విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. అతడి వేధింపులు రోజురోజుల మరీ ఎక్కువ కావడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీంతో సదరు పిఈటిపై ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసారు విద్యార్థులు.  

స్కూల్ హెడ్ మాస్టర్ ఉషారాణి, ఎంఈవో లక్ష్మి, ఎంపిడివో శ్రీనివాసరావులతో కలిసి నరసరావుపేటలోని పల్నాడు కలెక్టరేట్ కు వెళ్లారు విద్యార్థులు.  కలెక్టర్ శివశంకర్ ని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. టార్గెట్ చేసిమరి తమతో పాటు దాదాపు 50 మంది విద్యార్థులను పిఈటి అశోక్ చితకబాదాడని కలెక్టర్ కు తెలిపారు. తమ ఒంటిపై గాయాలను కలెక్టర్ కు చూపించి ఇలా విచక్షణారహితంగా కొట్టిన పిఈటిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. 

వీడియో

 అలాగే తమ సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. రెండ్రోజులుగా ఆహారం సరిగ్గా వుండటంలేదని... కనీసం తాగేందుకు మంచినీరు కూడా లేవని అన్నారు. దీంతో ఇంటినుండి తెచ్చుకున్నవి తిని... అవీ అయిపోయాక పస్తులు వున్నామని విద్యార్థులు తెలిపారు. వారి సమస్యలను విన్న కలెక్టర్ వాటిని పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios