కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ చదువుకుంటున్న పరమేష్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్ధులు గదిలో లేని సమయంలో అతను ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పరమేష్ స్వస్థలం విజయనగరం జిల్లా గోలజామ్. దీనిపై విద్యార్ధులు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.