ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం గత కొన్నేళ్లుగా సిద్ధమవుతూ.. పోటీ పరీక్షలు రాస్తున్నాడు. 

ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం గత కొన్నేళ్లుగా సిద్ధమవుతూ.. పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ సెక్రటరీ పరీక్షతో పాటు ఆర్ఆర్‌బీ పరీక్షకు దరఖాస్తు చేసి చదువుతున్నాడు.

అయితే రెండు పరీక్షలు ఒకే రోజు కావడంతో సదరు యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో పెట్రోలు బాటిల్ తీసుకుని ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల క్యాంపస్‌కు చేరుకున్నాడు. దీనిని గమనించిన విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సరిగ్గా విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుంటుండగా అడ్డుకుని పీఎస్‌కు తరలించారు.

అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. అక్టోబర్ 10న పంచాయతీ కార్యదర్శి పోస్టుకు, ఆర్ఆర్‌బీకి సంబంధించిన పోస్టులకు ఒకేసారి పరీక్ష జరుగుతుండటంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అందువల్ల రాష్ట్రప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. కాగా విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

"