ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. 

రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీటి ప్రకారం విమానాశ్రయ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. 
కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్ కు మాత్రమే అనుమతి ఉంటుంది.

స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రధాన ద్వారం వద్ద నిలుపుదల చేస్తారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఇక మీదట దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ నిర్దారణ అయిన ప్రయాణికులను వెంటనే క్వారంటైన్ కు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

ఇదిలా ఉండగా, ఏపీలో ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు.. 24 గంటల్లో18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 11 లక్షల 63వేల 994 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 71 మంది మరణించారు. 

తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9మంది చొప్పున మరణించారు. అనంతపురం,కర్నూల్ జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు.ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరులో ఐదురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 8207కి చేరుకొంది.

ఏపీలో కరోనా జోరు: మొత్తం కేసులు 11,63,994కి చేరిక...

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,67,18,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,732 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటివరకు10లక్షల 03 వేల 935 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  

రాష్ట్రంలో ఇంకా 1,51,852 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.గత 24 గంటల్లో అనంతపురంలో 1158, చిత్తూరులో 1714,తూర్పుగోదావరిలో1914,గుంటూరులో 1194, కడపలో 969,కృష్ణాలో 990, కర్నూల్ లో 2628, నెల్లూరులో 1337,ప్రకాశంలో 1236, శ్రీకాకుళంలో 1732, విశాఖపట్టణంలో 1960, విజయనగరంలో 1052,పశ్చిమగోదావరిలో 1088కేసులు నమోదయ్యాయి.