Asianet News TeluguAsianet News Telugu

కరోనా అలర్ట్ : మంగళగిరిలో నేటి నుంచి కఠిన ఆంక్షలు !

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కోవిడ్ ను కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా.. గుంటూరు జిల్లా మంగళగిరిలో నేటినుంచి ఆంక్షలు కఠినం చేశారు. 

strict covid rules in mangalagiri, guntur - bsb
Author
Hyderabad, First Published Apr 19, 2021, 10:32 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కోవిడ్ ను కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా.. గుంటూరు జిల్లా మంగళగిరిలో నేటినుంచి ఆంక్షలు కఠినం చేశారు. 

పెరుగుతున్న కేసుల వ్యాప్తి దృష్ట్యా 15 రోజులు కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగా సోమవారం నుంచి సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు మూసివేస్తున్నారు.

ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని ఆంక్షలు విధించారు. కోవిడ్ కేసుల విషయంలో ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించాలని అధికారుల నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా తీవ్రత: రేపు జగన్ హైలెవల్ భేటీ... నైట్‌కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం..?...

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. వైరస్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.

అలాగే పదో తరగతి పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షల వాయిదాపైన నిర్ణయం వెలువడే ఆస్కారం వుంది. ఇప్పుడు స్కూళ్లకు సెలవులు ప్రకటించే పరిస్ధితి కనిపిస్తోంది. కరోనా కట్టడికిగాను రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో సర్కార్ వున్నట్లుగా తెలుస్తోంది.

దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలు విధించే అవకాశం వుంది. బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం వున్నట్లు సమాచారం. వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వాలంటీర్లతో ఇంటింటి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో సీఎం వున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios