కరోనా ఎఫెక్ట్: గుజరాత్‌ నుండి ఏపీకి చేరుకొన్న 4 వేల మత్స్యకారులు

గుజరాత్ లో చిక్కుకొన్న మత్స్యకారులు శుక్రవారం నాడు ఉదయం కృష్ణా జిల్లాకు చేరుకొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ వద్ద సుమారు ఐదు వేల మంది మత్స్యకారులు చిక్కుకొన్నారు.

Stranded AP fishermen reached to andhra pradesh from Gujarat

అమరావతి:గుజరాత్ లో చిక్కుకొన్న మత్స్యకారులు శుక్రవారం నాడు ఉదయం కృష్ణా జిల్లాకు చేరుకొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ వద్ద సుమారు ఐదు వేల మంది మత్స్యకారులు చిక్కుకొన్నారు.

 ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్లో వారిని ఏపీకి పంపింది. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు  వద్ద  మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం స్వాగతం పలికారు. చెక్ పోస్టు వద్ద ఏపీ మంత్రి మోపిదేవి  వెంకటరమణతో పాటు మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులను కలిసి వారిని యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు.

ఈ 4 వేల మందిలో శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారిలో 2911 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందినవారు 711మంది ఉన్నారు. మిగిలిన వారు ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారుగా  ప్రభుత్వం ప్రకటించింది.

బస్సుల్లో వచ్చిన మత్స్యకారులకు ఆయా జిల్లాలకు తరలిస్తారు. అయితే ఆయా జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లలోనే వీరంతా 14 రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. క్వారంటైన్ పూర్తైన తర్వాతే ఇండ్లకు పంపనున్నట్టుగా మంత్రి మోపిదేవి ప్రకటించారు.

చెన్నైలో చిక్కుకొన్న కొందరిని కూడ ఏపీకి తరలించినట్టుగా ఏపీకి చెందిన అధికారులు గుర్తు చేశారు. ఏపీకి చేరుకొన్న మత్స్యకారులకు మత్స్యశాఖ అధికారులు భోజనం అందించారు. ఏపీకి మత్స్యకారులను తరలించేందుకు ప్రభుత్వం సుమారు రూ. 3 కోట్లను ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది.

గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ లో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన 4,060 మంది మత్స్యకారులను స్వంత రాష్ట్రానికి మంగళవారం నాడు గుజరాత్ రాష్ట్రం నుండి బయలు దేరారు. సముద్రమార్గం ద్వారా కాకుండా  బస్సుల్లో వీరిని ఏపీకి తరలించారు. సముద్రమార్గం ద్వారా వీరిని ఏపీకి తరలించాలని గుజరాత్ సీఎంను  జగన్ కోరారు. అయితే సముద్ర మార్గం ద్వారా కాకుండా బస్సుల్లో తరలించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

also read:కరోనా ఎఫెక్ట్: గుజరాత్ నుండి బస్సుల్లో ఏపీకి 5 వేల మంది మత్స్యకారులు...

గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ గ్రామంలో ఏపీ రాష్ట్రంలోని మత్స్యకారులు చిక్కుకొన్నారు.గత ఏడాది ఆగష్టు మాసంలో వీరంతా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు వారంతా సముద్ర జలాల్లోనే చేపల వేట కొనసాగిస్తారు. ఎనిమిది నెలల పాటు వీరంతా సముద్రంలోనే గడుపుతారు. నెలలో కనీసం 25 రోజుల పాటు వారంతా సముద్రంలోనే ఉంటారు. ఆ తర్వాతే వారు ఒడ్డుకు చేరుకొంటారు.

గత 25 రోజుల నుండి వారంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. దీంతో బోటు యజమానులు వారికి జీతాలు ఇవ్వలేదు. దుర్భర జీవితం గడుపుతున్నట్టుగా మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా చెప్పారు.  పనిలేక వేరావల్ లో వీరు ఉన్న ప్రాంతంలో సరైన వసతులు లేని కారణంగా ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. 

దీంతో వేరావల్ గ్రామంలో చిక్కుకొన్న మత్స్యకారుల విషయమై గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో ఏపీ సీఎం జగన్ ఈ నెల 21వ తేదీన ఆ తర్వాత మరోసారి మాట్లాడారు. వేరావల్ గ్రామంలో భోజనం, వసతి కల్పించాలని గుజరాత్ సీఎంను కోరారు. ఆ తర్వాత రెండు రోజులకే మత్స్యకారుడు మృతి చెందడంతో సముద్రమార్గం ద్వారా మత్స్యకారులను ఏపీకి పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

సముద్ర మార్గం ద్వారా కాకుండా రోడ్డు మార్గంలో ఏపీకి పంపేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం నాడు సాయంత్రం సుమారు 76 బస్సుల్లో మత్స్యకారులు ఏపీకి బయలుదేరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios