కరోనా కొత్త స్ట్రెయిన్ భయాందోన గొల్పుతోంది. శ్రీకాకుళంలో యూకే నుంచి వచ్చిన వారు గుబులు రేపుతున్నారు. వారు అక్కడి నుంచి ఎక్కడ కరోనా మోసుకోచ్చారోనని, జనాలు భయపడుతున్నారు.

బ్రిటన్ నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. నవంబర్ 25 తర్వాత యూకే నుంచి ఏపీకి 33 మంది వచ్చారు. వీరందరికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది.

దీంతో వీరఘట్టం మండలంలోని బీసీ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మరోవైపు యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఆమెతో పాటూ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మరికొంతమంది వచ్చారు.

ప్రస్తుతం వీరందరినీ ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆ మహిళతో పాటూ అదే బోగీలో మరో 8 మంది విశాఖ వాసులు ప్రయాణించినట్లు అధికారులకు సమాచారం అందింది.

ప్రస్తుతం వీరందరినీ ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆ మహిళతో పాటూ అదే బోగీలో మరో 8 మంది విశాఖ వాసులు ప్రయాణించినట్లు అధికారులకు సమాచారం అందింది.

వెంటనే రంగంలోకి అధికారులు అనకాపల్లిలోని లాడ్జి నుంచి విశాఖ కేజీహెచ్‌కు ముగ్గురిని తరలించారు. మిగిలిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఈ 8 మందిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అటు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు కూడా అదే బోగీలో ప్రయాణించినట్లుగా సమాచారం అందింది. వీరిని మచిలీపట్నానికి చెందిన వారుగా గుర్తించిన అధికారులు.. ట్రేసింగ్‌ పనిలో వున్నారు. కృష్ణా జిల్లా గూడవల్లి క్వారంటైన్ సెంటర్‌తో పాటు ఈడ్పుగల్లు క్వారంటైన్ సెంటర్‌ను సైతం పున: ప్రారంభించారు.