పదమూడేళ్ల బాలికపై కన్నేసిన సవతి తండ్రి.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అఘాయిత్యం..
అనకాపల్లిలో దారుణమైన ఘటన జరిగింది. ఓ సవతి తండ్రి పదమూడేళ్ల కూతురిమీద అత్యాచారం చేశాడు. ఇలా పలుమార్లు జరగడంతో బెదిరిపోయిన ఆ చిన్నారి తాను ఇక ఆ ఇంటికి రానంటూ మొరాయించింది.
అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మారుటి తండ్రి.. ఆ చిన్నారి మీద కన్నేశాడు. ఓ వైపు తల్లితో కాపురం చేస్తూ.. మరోవైపు కూతురి మీద అత్యాచారం చేశాడు. జుగుస్స కలిగించే ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా సబ్బవరంలో చోటుచేసుకుంది. సబ్బవరం సీఐ చంద్రశేఖరరావు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్బవరానికి చెందిన ఓ మహిళ భర్త తొమ్మిదేళ్ల కిందట మృతి చెందాడు. వారిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆమె సబ్బవరం సాయి నగర్ కాలనీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతని ద్వారా ఆమెకు మరో అమ్మాయి పుట్టింది. మొదటి కుమార్తె (13) సబ్బవరంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఏడవ తరగతి చదువు పూర్తి చేసింది.
చదువుకుంటున్న క్రమంలో సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు.. మారుటి తండ్రి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి ఒంటరిగా ఉన్న సమయంలో భయపెట్టి, బెదిరించి అత్యాచారం చేసేవాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అమ్మమ్మ ఇల్లు విజయనగరంలో ఉంది. కాగా, సెలవులు అయిపోయి స్కూల్స్ తెరిచినా.. బాలిక అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లే స్వయంగా బాలిక ను తీసుకువచ్చి, తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు వెళ్ళింది. ఆమె సబ్బవరానికి రావడాని ససేమిరా ఒప్పుకోలేదు.
చిత్తూరులో దారుణం... ప్రేమ విఫలమై ఇంటర్ యువతి ఆత్మహత్య
ఎంతగా అడిగినా కారణం చెప్పలేదు. కుటుంబ సభ్యులు కారణాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికీ బాలిక ఏం జరిగిందో చెప్పలేదు. ఏ రకంగా అడిగిన ఆమె నోటి నుంచి సమాధానం చెప్పించ లేకపోయారు. కానీ బాలిక జరిగింది చెప్పకుండా ఉండలేకపోయింది.. అలాగని జరిగిన దారుణాన్ని తన నోటితో చెప్పలేక పోయింది. దీంతో తనకు ఏం జరిగిందో ఓ చీటీమీద రాసి ఫ్రిడ్జ్ మీద పెట్టింది. అది చూసిన తల్లి చీటీ తీసుకుని చదివింది. షాక్ అయ్యాంది. గురువారం కుమార్తెతో కలిసి సబ్బవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని స్టేషన్ సిఐ వివరించారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారని చెప్పారు. బాలికను పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు పంపామని నిందితుడిని త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడతామని అన్నారు.