ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టేట్ ఆడిట్ ఆఫీసర్ రాగ మంజీర మంగళవారం నాడు మృతి చెందారు. 

ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడలో స్టేట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాగ మంజీర మృతి చెందారు.

స్టేట్ ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్న రాగ మంజీర ఇవాళ ఉదయం తన భర్తతో కలిసి విజయవాడ నుండి విశాఖకు వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఇబ్రహీంపట్నానికి సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న యాసిడ్ ట్యాంకర్‌ను రాగ మంజీర కారు ఢీకొంది. దీంతో రాగ మంజీరపై లారీలోని యాసిడ్ పడింది.

దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో కారును రాగ మంజీర భర్త రాజేష్ నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో రాజేష్ కూడ గాయపడ్డారు.