ఏపీలోని బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో అపశృతి జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణించారు.

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో అపశ్రుతి జరిగింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడిని ఒంగోలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసే ఉదరగుడి మురళిగా అధికారులు గుర్తించిన్నట్టు తెలుస్తోంది. ఆయనకు 30 సంత్సరాల వయస్సు ఉంటుందని సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఉక్రెయిన్ పై రష్యా అణుదాడిని ఆపడంలో భారత్ ది కీలక పాత్ర - సీఎన్ఎన్ రిపోర్ట్

సిద్ధం కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది. రెండు గంటల పాటు సాగింది. ఆరు గంటలకు ఈ సభ ముగిసింది. సీఎం వైఎస్ జగన్ ప్రసంగం తరువాత ఈ కార్యక్రమం నుంచి జనాలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గేటు దగ్గర ఒక్క సారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో మురళికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన మరణించాడు.

మూడు పిల్లర్లకు రిపేర్ చేయించే సత్తా రేవంత్ రెడ్డికి లేదా ? - కేటీఆర్

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.