వెంకన్న బ్రహ్మోత్సవాలు: రేపు తిరుమలకు ఏపీ సీఎం జగన్, పట్టు వస్త్రాలు సమర్పణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
తిరుమల: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సీఎం జగన్ సమర్పించనున్నారు.రేపు మధ్యాహ్నం 3:45 గంటలకు ఏపీ సీఎం జగన్ గన్నవరం నుండి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో సీఎం జగన్ తిరుమలకు వెళ్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుపతిలోని గంగమ్మ తల్లి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలిపిరిలో విద్యుత్ బస్సులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత రాత్రి 07:45 గంటలకు బేడి ఆంజనేయస్వామిని సీఎం జగన్ దర్శించుకొంటారు. అక్కడి నుండి నేరుగా తిరుమల స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు సీఎం జగన్ .
ఈ నెల 28వ తేదీ ఉదయం సీఎం జగన్ స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుమలలో పరకామణి భవనంతో పాటు లక్ష్మీవీపీఆర్ రెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు.ఉదయం 8:45 'గంటలలకు సీఎం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన ఓర్వకల్లు కు వెళ్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సీఎం వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ప్రయాణం చేసే మార్గంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.
శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలను సమర్పించేందుకు తిరుమలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది., రేణిగుంట ఎయిర్ పోర్టులో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా
ఎస్పీ పి. పరమేశ్వరరెడ్డి జేసీ డికె బాలాజీపాటు పలువురు అధికారులతో సమీక్షించారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది భక్తులను అనుమతించారు. భక్తులు శ్రీవారి భక్తులకు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. రేపటి నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా ఈ నెల 20వ తేదీన ఉదయమే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు.
alsoread :అంతకంతకూ పెరుగుతోన్న శ్రీవారి సంపద.. లక్ష కోట్లకు చేరువలో ఆస్తులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ అంకురార్ఫణ చేస్తారు.ఈ నెల 27న ధ్వజారోహనం, పెద్ద శేష వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 28న చిన్న శేష వాహనం,స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 29న సింహ వాహన సేవ, ఈ నెల 30న కల్పవృక్షవాహనసేవ, అక్టోబర్ 1న మోహిని అవతారంలో స్వామి వారు దర్శనమిస్తారు. అక్టోబర్ 2న హనుమంత వాహనసేవ, అక్టోబర్ 3న సూర్యప్రభ వాహన సేవ, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం, ధ్వజావరోహం నిర్వహించనున్నారు.