ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం ఏఈవో మోహన్‌పై సస్పెన్షన్ వేటుపడింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గత నెల 25న శ్రీశైలం దేవస్థానానికి సమీపంలోని గంగాసదన్‌లో మోహన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణలో మోహన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు తేలడంతో శ్రీశైలం దేవస్థానం ఈవో రామచంద్రమూర్తి... మోహన్‌ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.