Asianet News TeluguAsianet News Telugu

బిరబిరా కృష్ణమ్మ: శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

ఎగువ నుండి  భారీ వరదల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టురెండు గేట్లను బుధవారం నాడు రాత్రి ఎత్తారు గురువారం నాడు ఉదయం 10 గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 

Srisailam project 10 crest gates lifted lns
Author
Srisailam, First Published Jul 29, 2021, 9:56 AM IST

శ్రీశైలం: ఎగువ నుండి  వస్తున్న భారీ వరదల కారణంగా  శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ ను నీటిని విడుదల చేస్తున్నారు. గత వారంలో  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి.దీంతో  కృష్ణా నదికి వరద పోటెత్తింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుండి భారీగా వరద నీరు జూరాలకు వచ్చిచేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టుకు కూడ వరద భారీగా వస్తోంది.ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.

 

సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఎడమ, కుడి విద్యుత్ ప్రాజెక్టుల్లో  విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. విద్యుత్ ఉత్తత్తి కోసం 50 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 10 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.బుధవారం నాడు రాత్రి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.


 

Follow Us:
Download App:
  • android
  • ios