Asianet News TeluguAsianet News Telugu

ఎగువ నుంచి భారీ వరద.. కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో శ్రీశైలం జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. 

srisailam dam gates open ksp
Author
Srisailam, First Published Jul 28, 2021, 7:10 PM IST

భారీ వరద నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను అధికారులు బుధవారం ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులు. 2007 తర్వాత జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 881.5 అడుగులు . క్రమంగా 10 గేట్లు ఎత్తనున్నారు ప్రాజెక్ట్ అధికారులు. ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో  జలాశయం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios