శ్రీశైలం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live


1978 వరకు శ్రీశైలం ఆత్మకూరు నియోజకవర్గంలో భాగంగా వుండేది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో శ్రీశైలం ఏర్పాటైంది. శ్రీశైలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,794 . ఈ నియోజకవర్గంలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలున్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి విజయం సాధించారు. 2014, 2019లలో వైసీపీ నేతలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు గెలుపొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శ్రీశైలంలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈసారి మాత్రం శ్రీశైలంలో పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 
 

Srisailam Assembly elections result 2024 live ksp

శ్రీశైలం .. ఈ పేరు చెప్పగానే జ్యోతిర్లింగం, శక్తిపీఠం వెంటనే గుర్తొస్తాయి. విస్తారమైన నల్లమల అడవులు , అభయారణ్యం, ప్రకృతి సంపదతో పాటు ఆధునిక దేవాలయాలుగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించిన శ్రీశైలం డ్యామ్ కూడా ఇక్కడే వుంది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో వున్న ఈ నియోజకవర్గంలో ఇరు రాష్ట్రాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. 1978 వరకు శ్రీశైలం ఆత్మకూరు నియోజకవర్గంలో భాగంగా వుండేది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో శ్రీశైలం ఏర్పాటైంది. ఎన్నికల సీజన్ కావడంతో ఇక్కడ ఎండలే కాదు.. రాజకీయం కూడా అట్టుడుకుతోంది. 

శ్రీశైలం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. రెడ్లదే ఆధిపత్యం :

శ్రీశైలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,794 . ఈ నియోజకవర్గంలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలున్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి విజయం సాధించారు. 2014, 2019లలో వైసీపీ నేతలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు గెలుపొందారు. నంద్యాలలో రెడ్డి సామాజికవర్గం నేతలతే హవా. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులు ఆ సామాజికవర్గానికి చెందినవారే. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణి రెడ్డికి 92,236 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డికి 53,538 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 38,698 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. 

శ్రీశైలం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :

2024 అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శ్రీశైలంలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని జగన్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఆయన మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ పసుపు జెండా ఎగరలేదు. ఈసారి మాత్రం శ్రీశైలంలో పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. జగన్‌ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనను గెలిపిస్తాయని రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios