ఏపీకి ప్రత్యేక హోదా కోసం శ్రీనివాసరావు సూసైడ్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం శ్రీనివాసరావు సూసైడ్

విజయవాడ: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనే
డిమాండ్ తో శ్రీనివాసరావు అనే వ్యక్తి కృష్ణా జిల్లా అరిగిపల్లి
తహసీల్దార్ కార్యాలయం వద్ద  ఆత్మహాత్యాయత్నానికి
పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం
నాడు ఆయన మృతి చెందాడు.

ప్రత్యేక హోదా కోసం  ఆందోళనలు చేస్తున్న క్రమంలో ఈ
నెల 23న  అరిగిపల్లి తహసీల్దార్ కార్యాలయ వద్ద బెజవాడ
శ్రీనివాసరావు ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డాడు.
స్థానికులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు
గురువారంనాడు మృతిచెందాడు. శ్రీనివాసరావు
మృతదేహన్ని పలు పార్టీల నేతల ప్రజా సంఘాల నేతలు
సందర్శించి నివాళులర్పించారు. 

మృతుడి కుటుంబానికి పలు పార్టీలనేతలు సానుభూతిని
తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ కూడ
ఆత్మహత్యలకు పాల్పడకూడదని పార్లీల నేతలు కోరారు. 


 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page